కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు సందర్శించారు. డాక్టర్ బాలకృష్ణ మరియు కార్యకర్తలను కలిసి మాట్లాడారు. ఎవరైన సరే బాన్సువాడ నియోజక వర్గంలో రాజకీయంగా ఎదుర్కొనలేక తమ కార్యకర్తలపై రౌడీయిజం చేసిన, వారిని భయ బ్రాంతులకు గురి చేసిన సహించేది లేదని, అవసరమైతే ఎక్కడికిన వెళ్లడానికి తాము సిద్ధమేనని, నియోజక వర్గంలో బిఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు ఎటువంటి హాని జరుగకుండా అండగా ఉంటామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలకృష్ణ, కొర్రి శివకుమార్ యాదవ్, గుడికొండ సుభాష్, నారం శ్రీనివాస్, గంగప్ప, సాయిలు యాదవ్, మాజీ వార్డు సభ్యులు కుమ్మరి గంగాధర్, మేకల నవీన్, సాయి, రమేష్, కటిక హుసేన్ తదితరులు ఉన్నారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం : ఎలమంచిలి శ్రీనివాసరావు
by Bayikad Ravi
Published On: September 10, 2025 5:57 pm