కండక్టర్ నర్సింలును సన్మానించిన ఈడీ పురుషోత్తం నాయక్

IMG 20240730 125454
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆర్టీసీ సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కండక్టర్ పి.నర్సింలును ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పురుషోత్తం నాయక్ సన్మానించారు. మంగళవారం సంగారెడ్డి డిపోలో టీజీ ఆర్టీసీ త్రైమాసిక ప్రగతి చక్ర అవార్డులో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన కండక్టర్ పి.నర్సింలును హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ పురస్కారాన్ని అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎం ఉపేందర్, గజ్వేల్ డీఎం పవన్, మెదక్ డీఎం సురేఖ, ఆర్ఎం ప్రభులత, డిప్యూటీ ఆర్ఎం దేవదానం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now