ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం, విద్యార్థులు సాధించిన విజయాలపై హోంమంత్రి అనిత ప్రశంసలు కురిపించారు. మీడియా ప్రకటనల ద్వారా విద్యార్థులను అభినందించడం మంచి పరిణామమని ఆమె అన్నారు.
పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా అభినందనలు ప్రకటించడం విశేషమని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలవడం గర్వకారణమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
వంద రోజుల ప్రణాళిక అమలులో భాగంగా విద్యార్థుల ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని, ఇది విద్యారంగంలో జరిగిన ప్రక్షాళనకు నిదర్శనమని ఆమె తెలిపారు.
గత ఐదేళ్లలో గాడితప్పిన విద్యారంగాన్ని పునరుద్ధరించడంలో ఈ ప్రణాళిక సఫలమైందని, ఘన విజయం సాధించిన విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చని, లోకేశ్ వేసిన పునాదులు ఇప్పుడు విజయానికి దారితీశాయని హోంమంత్రి అనిత సూచించారు.











