రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం 77%, రెండవ సంవత్సరం 81% ఉత్తీర్ణత సాధించారు.
మొదటి సంవత్సరం విద్యార్థులు 77% ఉత్తీర్ణత సాధించగా, ఇది గత 12 ఏళ్లలో అత్యధికమని అధికారులు పేర్కొన్నారు. రెండవ సంవత్సరం విద్యార్థులు 81% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేశారు.
ప్రభుత్వ, ప్రభుత్వ ఆధీన జూనియర్ కళాశాలల్లో (GJCs) కూడా గణనీయమైన పురోగతి కనిపించింది. మొదటి సంవత్సరం GJCs విద్యార్థులు 54% ఉత్తీర్ణతతో 12 ఏళ్లలో అత్యధిక రికార్డును సాధించగా, రెండవ సంవత్సరం GJCs విద్యార్థులు 68% ఉత్తీర్ణతతో రెండవ అత్యుత్తమ స్థానంలో నిలిచారు.
ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్సైట్లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే, 9552300009 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపినా ఫలితాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.











