రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ మోడల్ స్కూల్లో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కానున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమం కింద విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు (కేటీఆర్) గారి ఆదేశాల మేరకు నిర్వహించబడింది. విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన ప్యాడ్లు, పెన్నులు అందించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆయన సూచించినట్లు తెలిసింది.
ఈ కార్యక్రమంలో నామాపూర్ శాఖ గ్రామ అధ్యక్షులు తాడేపు అనిల్, ఉపాధ్యక్షులు ఆకారం బాలచంద్రు, చిప్పలపల్లి సర్పంచ్ మాచేటి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ తాడేపు ఎల్లం, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కోమటి రాజమల్లుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు చేయూత అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

