JEE అడ్వాన్స్ ఫలితాలలో 24వ ర్యాంకు సాధించిన సాయి వినీల్ ను RK కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి సన్మానించారు.
సాయి వినీల్, EWS కేటగిరీ లో 2వ ర్యాంకు సాధించి, కామారెడ్డి జిల్లాకు గర్వకారణమయ్యారు. డాక్టర్ జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్లడం ఎంతో హర్షించదగ్గ విషయం అని తెలిపారు.
అభినందన కార్యక్రమంలో, సాయి వినీల్ కు శాలువా, మెమెంటో, మరియు మెడల్ అందించబడింది. నగదు బహుమతి ఇచ్చి, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సీఈవో, డీన్ నవీన్ కుమార్, ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి, మరియు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.











