సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించబోయే “మేరా యువభారత్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ పోస్టర్ను విడుదల చేశారు .ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ సమైక్యతకోసం పోరాడిన మహనీయుడు, ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ ఆశయసాధన మనందరి లక్ష్యం అని, భారత దేశాన్ని ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ గా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు తన వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు. దేశం ముందు, ఆ తర్వాతే ఏదైనా అనే ఆలోచనతో యువత ముందుకు రావాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని కళాశాలల్లో ఉపన్యాసాలు, వ్యాసరచన, రంగోలి వంటి పోటీలు నిర్వహించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్, ఎన్‌సిసి, పోలీస్, విద్య, వైద్య తదితర ప్రభుత్వ శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. అంతకు ముందు సంగారెడ్డి జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అక్టోబర్ 31 తేదీ నుండి నవంబర్ 25 వ తేదీ వరకు నిర్వహించబోయే సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలపై ఉమ్మడి మెదక్ జిల్లా మేరా యువ భారత్ అధికారి రంజిత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమైక్యత కోసం పోరాడిన మహనీయుడు, ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ ఆశయసాధన మనందరి లక్ష్యంగా ఆయన 150వ జయంతని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, ఏక్ భారత్ – ఆత్మనిర్బర్ భారత్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఏక్తా ర్యాలీ (సర్దార్@150 యూనిటీ మార్చ్ పేరుతో పాదయాత్ర, కలిసి నడుద్దాం.. విజయవంతంచేద్దాం, – ఈ ఏక్తా ర్యాలీ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. నిర్వహించబోయే కార్యక్రమాలు ఈనెల 31న సర్దార్ పటేల్ విగ్రహాలకు నివాళులు, – కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా లోని ఐ.బి గెస్ట్ హౌస్ నుండి నుంచి పోతరెడ్డి చౌరస్తా, వరకు ఎక్త మార్చ్, – కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ఎకతా మార్చ్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఈ ఎక్తా యాత్రలు నిర్వహించబోతున్నామని తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించబోయే మేరా యువ భారత్ ఎక్తా ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడాల అధికారి ఖాసీం బేగ్, జిల్లా కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్, ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్లు రాజుగౌడ్, పాపయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్”- జాతీయ సమైక్యతకు ప్రతీక: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: October 28, 2025 6:22 pm