కామారెడ్డిలో ఎన్నికల అవగాహన – ఫ్రాడ్ కా ఫుల్ స్టాఫ్ ఏర్పాటు

కామారెడ్డిలో ఎన్నికల అవగాహన – ఫ్రాడ్ కా ఫుల్ స్టాఫ్ ఏర్పాటు

పోలీస్ కళాబృందంచే అవగాహన కార్యక్రమం

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా డిసెంబర్ 04:

 

ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసు శాఖ నిర్వహించింది. కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ప్రజలకు ఎన్నికలలో ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని, పాత కక్షలను ప్రోత్సహించే గొడవలకు దూరంగా ఉండాలని సూచించింది. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగడం అందరి బాధ్యత అని, మీ విలువైన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

 

ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకంగా ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాఫ్’ ఏర్పాటు చేసి ప్రజలు మోసపోవకుండా చైతన్యపరిచారు. APK తరహా అనుమానాస్పద ఆప్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు.

 

అత్యవసర సమయంలో DAIL 100 కు వెంటనే కాల్ చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మొబైల్ ఫోన్లు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ U. శేషారావు, పోలీస్ కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, అలాగే పెట్రో కార్ WPC వెంకట లక్ష్మి పాల్గొన్నారు. పాటలతో, మాటలతో ప్రజల్లో ఎన్నికల అవగాహన కల్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment