సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ పొలాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి విద్యుత్ శాఖ ఎస్ఈ మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ పొలాల వద్ద మధ్య ఉన్న కరెంటు స్తంభాలు, తడిగా ఉన్న ఇంటి గోడలు, మోటారు స్టార్టర్లు, తెగి పడిన విద్యుత్ తీగలు, సర్వీస్ వైర్లు, సపోర్టు తీగలను ఎవరు కూడా తడిగా ఉన్నప్పుడు తాకరాదని అన్నారు. అలాగే కరంటు తీగలు లేదా సర్వీసు వైర్లు తెగిపడినప్పుడు ముట్టుకోరాదని, ఏదైనా కరంటు సమస్య ఉన్నప్పుడు సంబంధిత అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, దగ్గరలో ఉన్న విద్యుత్తు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఎస్ఈ మాధవరెడ్డి తెలిపారు.