Site icon PRASHNA AYUDHAM

విద్యుత్ తీగలను తగులుతున్న చెట్లను తొలగించడంలో విఫలమవుతున్న విద్యుత్ అధికారులు..!

IMG 20250105 WA0014

విద్యుత్ తీగలను తగులుతున్న చెట్లను తొలగించడంలో విఫలమవుతున్న విద్యుత్ అధికారులు..!

ప్రశ్న ఆయుధం, దోమకొండ, జనవరి 5

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్ర లో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగల అల్లుకుపోయిన అధికారులు మాత్రం, అటువైపు చూడడం లేదు. దోమకొండ మండలంలోని శివరాం మందిర్ రోడ్డుకు ఇరువైపులా. విద్యుత్ స్తంభాలను చెట్లు అల్లుకుపోయాయి. దోమకొండ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి, సబ్ రిజిస్టర్ ఆఫీసు, పోస్ట్ ఆఫీస్, మార్కెట్ రోడ్డు, శివరాం మందిర్ టెంపుల్ వరకు, విద్యుత్ స్తంభాలకు, చెట్ల కొమ్మలు అల్లుకుపోయాయి.

అధికారులు మాత్రం, పట్టించుకోవడంలేదని, ప్రజలు, చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో సమస్య వచ్చినప్పటికీ అధికారులు చోద్యం చూశారు. గతంలో గాలులు పెట్టినప్పుడు ఒక చెట్ల కొమ్మ లు విరగడం వల్ల విద్యుత్కు చాలా కొన్ని గంటలు అంతరాయం ఏర్పడింది. ఇళ్లలో ఉండే ప్రజలు. హాస్పటల్లో ఉన్న పేషెంట్లు, ఆఫీసులకు, ఆన్లైన్ సేవలకు చాలా అంతరాయం ఏర్పడింది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి. ఈ సంవత్సరం పరిష్కరించగలరని గ్రామస్తులు కోరుచున్నారు.

Exit mobile version