సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): వేసవి కాలం సందర్భంగా ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో ఇంద్రేశం గ్రామంలో అయిలాపురం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువ నాయకులు బలరాం, మెట్టు శ్రీధర్ లు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువత సమాజసేవలో ముందుండాలని దేశభవిషత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్రని సమాజం నుండి తీసుకోవడమే కాకుండా తిరిగి సమాజానికి సేవరూపంలో తిరిగి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
అయిలాపురం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
Published On: March 23, 2025 7:14 pm