సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రతి కార్యకర్త వంద సభ్యత్వాలు పూర్తి చేసుకుని క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి క్రియాశీల సభ్యత్వ నమోదు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ బసవపురం లక్ష్మీ నరసయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త వంద సభ్యత్వాలు పూర్తి చేసుకుని క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలని, రానున్న వారం రోజులు కార్యకర్తల అందరూ క్రియాశీల సభ్యత్వానికి అర్హులు కావడం కోసం వంద సభ్యత్వాలను పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతి బూత్ లో ఇద్దరు క్రియాశీల సభ్యత్వాలు తీసుకునే విధంగా పట్టణ మండల అధ్యక్షులు కృషి చేయాలని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పాలించిన నాయకులు రాజకీయాల పైన వైదొలగాలని అనిపిస్తుందని, కేటీఆర్, కేసీఆర్ రాజకీయాల్లో నుంచి వెళ్లినా.. తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం లేదని, అధికారం కోసం రాజకీయాలకు వచ్చారని, అధికారం వెళ్ళిపోగానే వారికి రాజకీయాల నుంచి వెళ్లిపోవాలని ఆలోచన కలుగుతుందని, గతంలో మీరు ఫామ్ హౌస్ నాటకాన్ని తీసుకొచ్చారని అన్నారు. అదే ఫామ్ హౌస్ నాటకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ మంత్రులు దీపావళి పటాకులు పేలుతాయని అరెస్టులు ఉంటాయని ప్రగల్బాలు పలికారని, దీపావళి పటాకులు ఫెలైకాని రాజకీయ అరెస్టులు పటాకులు పేలలేవని ఎద్దేవా చేశారు. దీపావళి పండుగ ముందు రోజున ఎవరైనా మందు పార్టీలు చేస్తారని, తెలంగాణలో ఎవరైనా మహిళలు మద్యం తాగుతారని, ఇది రేవు పార్టీ లేదా.. రావుల పార్టీ అని అన్నారు. పది మంది ఒక చేత చేరితే పది బాటిళ్లు మద్యం తాగుతారా.. అని అది ఒక బార్ లా ఉందని తెలిపారు. కేటీఆర్ పాదయాత్ర చేసిన మోకాల యాత్ర చేసినా.. తెలంగాణ ప్రజల నమ్మకం లేదన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వాన్ని అప్పుడున్న ప్రభుత్వం ఫామ్ హౌస్ స్టోరీలు సృష్టించడం జరిగిందని గుర్తు చేశారు.
అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. విధిగా ప్రతి కార్యకర్త వంద సభ్యత్వాలు పూర్తి చేసుకొని క్రియాశీల సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని, జిల్లాలోని నాయకులు కార్యకర్తలు క్రియాశీల సభ్యత్వం కోసం తమ తమ సభ్యత్వాలు టార్గెట్ ను పూర్తి చేసుకుని పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక మరియు క్రియాశీల సభ్యత్వాలు మొదటి స్థానంలో ఉండే విధంగా కార్యకర్తలందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, ఎడ్ల రమేష్, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, రాజేశ్వరరావు దేశ్ పాండే, దోమల విజయకుమార్, మందుల నాగరాజ్, ద్వారకా రవి, సదానంద చారి, రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ యాదవ్, మీనా గౌడ్, శివగల నాగరాజ్, శివ, శ్రీనివాస్ రెడ్డి, సాయి రెడ్డి, మండల పట్టణ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.