సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటి వరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ నుండే వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారని తెలిపారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25వ తేదీతో ముగుస్తుందని అన్నారు.
తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: October 21, 2025 6:19 pm