కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఉత్సాహం – బాన్సువాడలో కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ ఘనంగా🔹

🔹కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఉత్సాహం – బాన్సువాడలో కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ ఘనంగా🔹

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి (డీసీసీ ప్రెసిడెంట్) ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది.

ఈ క్రమంలో బాన్సువాడ పట్టణంలో జరిగిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

బాన్సువాడలో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కీలక సమావేశం.

ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ సభ్యుడు రాజ్‌పాల్ ఖరోలా ప్రత్యేక అతిథి.

తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్, జిల్లా అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ హాజరు.

కాంగ్రెస్ పునర్నిర్మాణం – బలమైన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని బాల్ రాజ్ వ్యాఖ్య.

పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తల హాజరుతో వేడుక వైభవంగా.

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 16 బాన్స్ వాడ

డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ ఎంపీ రాజ్‌పాల్ ఖరోలా హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.

కాసుల బాల్ రాజ్ మాట్లాడుతూ – “కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీని బలోపేతం చేసే, కృషిశీలుడైన నాయకుడిని ఎంపిక చేయడం కాంగ్రెస్ లక్ష్యం” అని తెలిపారు.

ఈ సమావేశంలో మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఖలేఖ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ బిన్ మోసీన్, అలీ బిన్ అబ్దుల్లా, కృష్ణ రెడ్డి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, నార్ల సూరి, షాహబ్, అఫ్రోజ్, డైరెక్టర్ సాయిలు, మండల అధ్యక్షులు శంకర్, కాంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లా కాంగ్రెస్ పునర్ వ్యవస్థీకరణలో ఈ సమావేశం కీలక మలుపు అవుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment