*విద్యార్థులు ఐఐఐటీ ఎంట్రన్స్ టెస్ట్ లో ఉత్తీర్ణులు కావడం గర్వకారణం:*
*ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్*
*నేడు విద్యార్థులకు 5వేల రూపాయల చొప్పున అందించనున్న చక్రధర్ గౌడ్*
మెదక్/సిద్దిపేట, ఆగస్టు 4(ప్రశ్న ఆయుధం న్యూస్): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పిహెచ్ఎస్)లో 22 మంది విద్యార్థులు ఐఐఐటీ ఎంట్రన్స్ టెస్ట్ లో ఉత్తీర్ణులు కావడం గర్వకారణం అని ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కృషికి తనవంతు ప్రోత్సాహం ఒక్కో విద్యార్థికి 5వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని, దేశం గర్వపడే విధంగా ముందుకు సాగాలని యువతకు చక్రధర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 5న ఉదయం 9 గంటలకు నంగునూర్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మనో ధైర్యం నింపిన వాళ్ళం అవుతామని చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు.