యూరియా కోసం అధికారిపై ఆగ్రహం.. టోకెన్ ఇచ్చి యూరియా రాదని చెప్పడంతో ఆందోళన చేసిన రైతులు

శివ్వంపేట, ఆగస్టు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): యూరియా టోకెన్లు ఇచ్చి.. యూరియా రాదని తెలపడంతో వ్యవసాయ అధికారి లావణ్యపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివ్వంపేట రైతు వేదిక వద్ద శనివారం సాయంత్రం జరిగింది. అలాగే నర్సాపూర్-తూప్రాన్ ప్రధాన రహదారిపై రైతులు కొద్దిసేపు రాస్తారోకో చేశారు. శివ్వంపేట మండలలోని పలు గ్రామాల నుంచి యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి రైతు వేదిక వద్ద టోకెన్లు తీసుకొని ప్రాథమిక వ్యవసాయ సొసైటీ వద్ద ఉదయం నుంచి గంటల కొద్ది సమయం కేటాయించి క్యూ లైన్ లో నిలుచున్నారు. దీంతో అధికారులు యూరియా రావడం లేదని తెలపడంతో రైతు వేదిక వద్దకు రైతులు చేరుకొని వ్యవసాయ అధికారి లావణ్యను రైతులు నిలదీసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులకు 450 టోకెన్లు మాత్రమే ఇచ్చారు. మిగతా మంది రైతులు నిరాశతో వెనుక తిరిగారు. ఈ విషయంపై ఫ్యాక్స్ సీఈవో మధు మాట్లాడుతూ.. అనివార్య కారణాలవల్ల యూరియా లారీ రాలేదని అన్నారు. టోకెన్లు ఇచ్చిన 450 మంది రైతులకు ఆదివారం యూరియా అందజేస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment