.
Headlines (Telugu)
-
“ఆరు ఏళ్ల తర్వాత తండ్రిని గుర్తించిన కూతుర్లు: హృదయానికి హత్తుకునే కథ”
-
“మతిస్థిమితం కోల్పోయిన తండ్రిని గుర్తించిన కూతుర్లు: అనాధ ఆశ్రమంలో భావోద్వేగ దృశ్యాలు”
-
“తండ్రిని హత్తుకున్న కూతుర్లు: ఆరు సంవత్సరాల విరహం ముగిసిన క్షణాలు”
-
“జూబిలిహిల్స్ ఆశ్రమంలో తండ్రితో పునర్మిళనం: కన్నీటి క్షణాలు”
-
“తండ్రి ప్రేమకు దూరమైన కూతుర్లకు మరో అవకాశం: భావోద్వేగ సంఘటన”
ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్నతండ్రిని చూసి బాగోద్వేగానికి గురైన కూతుర్లు. ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబిలిహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ‘ఆశ్రయం’ కల్పించడం జరిగింది. గత నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య మన ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించడాని వచ్చినప్పుడు తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడు అని చెప్పడం జరిగింది.
మళ్ళీ బాలయ్య కూతుర్లు ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 130మందిలో తమ కన్నతండ్రిని గుర్తుపట్టి బాగోద్వేగానికి గురై కన్నతండ్రిని హత్తుకున్న ఈ దృశ్యాన్ని చూస్తే నిజంగా వారికి తమ తండ్రిని ఇంతకాలం ఎంతగా మిస్ అయ్యారో తెలుస్తుంది. ఇంతకాలం కన్నతండ్రి ప్రేమకు దూరమైన ఈ కూతుర్లకు నేడు తమ తండ్రిని ఒకటి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఉన్నపుడు మనకు ఈ నాన్న విలువ తెలియదు. ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూకోండి. వారిని ప్రేమించండి పూజించండి…. .