మెదక్/నర్సాపూర్, ఆగస్టు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6, 7, 9వ వార్డులలో గత రెండు రోజులుగా కురిసిన వర్షం కారణంగా పలు ఇళ్లు దెబ్బతిన్న బాధితు కుటుంబాలను బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, నాయకులు పరిశీలించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్, మాజీ కౌన్సిలర్ బాల్ రెడ్డి మాట్లాడుతూ.. పలు కాలనీల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు నేరుగా ఇళ్లలోకి చేరి గృహోపకరణాలు తడిసి నష్టం వాటిల్లిందని తెలిపారు. అనేక ఇళ్లు గోడలు, పైకప్పులు దెబ్బతిన్నాయని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 40 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అదనంగా మరో 40 కోట్ల రూపాయల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ 40 కోట్లు రద్దయి వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పేరుతో కాలనీల్లో పర్యటిస్తున్నా, సమస్యలు పరిష్కరించడం లేదని తెలిపారు. ముఖ్యంగా రద్దయిన 40 కోట్ల నిధులను తిరిగి నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భోగ శేఖర్, నాయకులు సత్యం గౌడ్, పంబాల బిక్షపతి, తంగడపల్లి ఆంజనేయులు గౌడ్, షేక్ హుస్సేన్, హైమద్, ఆనంద్, వినయ్, రామచందర్, హమీద్, మమ్మద్ షరీఫ్, మోహిజు తదితరులు పాల్గొన్నారు.