గొర్రెల కాపరి సుధాకర్ కుటుంబానికి ఆర్థిక సాయం
గొర్రెల కాపరి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా నవంబర్ 25:
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లికి చెందిన గొర్రెల కాపరి సుధాకర్ మరణించడంతో, ఆయన కుటుంబాన్ని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “సుధాకర్ కుటుంబానికి నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. పిల్లల చదువుకు అవసరమైన సహకారం అందిస్తాను” అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మామిళ్ల అంజయ్య, నిమ్మ విజయ్ రెడ్డి, వీరన్న పటేల్, తాజా మాజీ కౌన్సిలర్లు ఊర్దొండ రవి, చాట్ల వంశీ, పంపరి శ్రీనివాస్, పిడుగు మమత సాయిబాబా, శంకర్ రావు, గడ్డమీది మహేష్, మామిళ్ల రమేష్, రంగ రమేష్, నవీన్, యూత్ నాయకులు ఆబిద్, ఇమ్రాన్, బల్ల శ్రీనివాస్, కిరణ్, నర్సుల మహేష్, మున్నా, శశి, గౌస్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.