Headlines:
-
దీపావళి టపాకాయల దుకాణాలకు అనుమతి తప్పనిసరి: జిల్లా ఎస్పీ హెచ్చరిక
-
పోలీస్ అనుమతి లేకుండా టపాకాయల షాపులు నిషేధం: టపాకాయల సేఫ్టీ మార్గదర్శకాలు
-
టపాకాయల దుకాణాలకు సురక్షిత స్థలాలు, NOC, సేఫ్టీ పరికరాలు తప్పనిసరి
సంగారెడ్డి ప్రతినిధి, (ప్రశ్న ఆయుధం న్యూస్): దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలికంగా టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసే వారు తప్పకుండా సంబంధిత పోలీస్ అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సూచించారు. అందుకు గాను సంబంధిత సబ్-డివిజన్ పోలీసు అధికారి కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. దుకాణదారులు ఎవరైనా పోలీసు అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు 1884 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని వెల్లడించారు.
*టపాకాయల దుకాణాదారులు పాటించవలసిన నియమ, నిబంధనలు:*
• టపాకాయల దుకాణాలను నెలకొల్పే వారు తప్పక సంబంధిత పోలీసు అధికారుల అనుమతి పొంది ఉండాలి.
• టపాకాయల దుకాణాలు ఖాళీ ప్రదేశాలలో జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన స్థల యజమాని నుండి ఎన్.ఓ.సి సర్టిఫికేట్ పొంది ఉండాలి.
• షాపుకు-షాపుకు మధ్య వ్యత్యాసం 3 మీటర్లు మరియు రెసిడెన్షియల్/గృహనిర్మాణలకు 50 మీటర్ల దూరంలో ఉండాలి.
• జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదు.
• టపాకాయల దుకాణాలలో ఫైర్ ఆక్సిడెంట్ కు సంబంధించి తక్షణం స్పందించే విధంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలియజేశారు.