మధుమేహము – ఐదు సూత్రాలు..
ఈ రోజుల్లో షుగర్ వ్యాధి (మధుమేహ వ్యాధి) తో జీవిస్తున్న 6.24 కోట్ల భారతీయులు యధార్దాలను అపోహల నుంచీ వేరు చేసి చూడగలగటం కొంచెం కష్టతరమయిన విషయమే. షుగర్ గల వ్యక్తులు వ్యాధి నియంత్రణా విధానాలను మరింత మెరుగ్గా అర్ధం చేసుకునేందుకు వీలుగా డా: వైద్య,, శివకుమార్ పోల అందిస్తున్న ఐదు ముఖ్యమైన సూత్రాలు.*
షుగర్ ప్రమాదకరమైన వ్యాధి. అది గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండా సమస్యలు మరియు కాళ్ళు, పాదముల అంగచ్చేదనం వంటి త్రీవ్రమైన అనర్ధాలకు దారితీస్తుంది. షుగర్ గల వ్యక్తులు వ్యాధిని మెరుగ్గా నియంత్రించుటకు, తద్వారా అనర్ధాల బారిన పడకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించటం, శ్రమ గల జీవన విధానం అలవాటు చేసుకోవటం మరియు అధిక బరువు లేకుండా చూడటం వంటివి వాటిలో ముఖ్యమైనవి. మూడు నెలల షుగర్ సగటు (HbA1C) , బ్లడ్ ప్రెషర్ మరియు బ్లడ్ కొలెస్టరాల్ మెరుగ్గా నియంత్రించట ద్వారా గుండెపోటు, పక్షవాతం లేదా ఇతర సమస్యల బారిన పడకుండా చూసుకోవడం, సమగ్ర షుగర్ వ్యాధి చికిత్సా విధానం లో ఓ భాగం.*
చెక్కర విలువలు ఖచ్చితంగా తెలుసుకొనేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం రక్తం లో షుగర్ పరీక్ష చేయించడమే. లక్షణాలు కన్నా ముందే త్రీవ్రమైన అనర్ధాలు బయట పడే అవకాశo ఉంది కాబట్టే షుగర్ వ్యాధిని “నిశ్శబ్ద రోగము” అని కూడ సంబోదిస్తుంటారు. మీ షుగర్ వైద్య బృందం తో చర్చించి మీకు సురక్షితమైన షుగర్ స్థాయిల టార్గెట్ ను నిర్దేశించుకోవాలి. ఇంటి వద్దనే షుగర్ స్థాయిలను తమంతట తామే తెలుసుకోగల విదాన్నాన్ని నేర్చుకోని పరీక్షా ఫలితాలను నమోదు చేయడమే కాక మీ యొక్క వైద్యుడితో వాటిని పంచుకోవాలి. అలాగే, మీకు సురక్షితమైన HbA1C పరీక్ష టార్గెట్ ని కూడ నిర్దేసించుకొని క్రమం తప్పకుండా పరీక్షించుకొంటూ వాటి ఫలితాలను కూడా నమోదు చేసుకుంటూ ఉండాలి….