చిట్కుల్ లో ధూంధాం గా ఫలహారం బండి వేడుకలు
అలరించిన శివవేష దారుల,పోతురాజుల విన్యాసాలు..
అదిరిపోయేలా ఏర్పాట్లు చేసిన ఎన్ఎంఆర్ యువసేన
ముఖ్య అతిథిగా హాజరైన నీలం మధు ముదిరాజ్
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చిట్కుల్లో జరిగే దుర్గమ్మ జాతర తో పాటు బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలలో రెండవ రోజు ఎన్ఎంఆర్ యువసేన చిట్కుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి వేడుకలు ధూంధాంగా జరిగాయి. ఈ పలహారం బండి వేడుకలకు ఎన్ఎంఆర్ యువసేన భారీ ఏర్పాట్లను చేసింది. సాయంత్రం ఏడు గంటలకు నీలం మధు నివాసం నుంచి ప్రారంభమైన ఫలహారం బండి ఊరేగింపు చిట్కుల్ పూరవీధుల మీదుగా సాగింది. ఫలహారం బండి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్,డీజే సౌండ్ ఆకటుకున్నాయి. ఈ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా రప్పించిన కేరళ కళాకారుల నృత్యాలు, డిజె సౌండ్ లోని పాటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫలహారం బండి ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు చూపరులను అలరించాయి. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన బాణసంచా పేలుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫలహారం బండిపై అమ్మవారి ప్రతిమను ఉంచి ఊరేగింపుగా తీసుకు వెళ్తున్న సమయంలో ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ధూమ్ ధామ్ గా ఆనందోత్సవాలతో డాన్సులు చేస్తూ జై మాతాది నినాదాలతో హోరెత్తించారు. ఈ ఫలహారం బండి ఊరేగింపులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.