రిపోర్టర్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

సంగారెడ్డి/నారాయణఖేడ్, జూన్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): నారాయణఖేడ్ రిపోర్టర్ దత్తు అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకొని వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వీరి వెంట మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, మనూర్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నర్సింలు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now