మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ
*గ్రామ స్వరాజ్య సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ పుల్ల సుజాత*
*జమ్మికుంట ఆగస్ట్ 7 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పాత సుజాత హాస్పిటల్ (గాంధీ చౌక్) మొదటి అంతస్తులో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ (పెద్ద మేకర్స్) శిక్షణ కేంద్రాన్ని గురువారం సంస్థ కరీంనగర్ జిల్లా కో-ఆర్డినేటర్ పుల్ల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత శిక్షణతో పాటు.. శిక్షణ అనంతరం సబ్సిడీపై నాణ్యమైన కుట్టు మిషన్ ను అందజేస్తామని ప్రతి గ్రామంలో నెల రోజులపాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. మొదటి బ్యాచ్ ఎలబోతారం రెండవ బ్యాచ్ సిరిసెడు మూడవ బ్యాచ్ జమ్మికుంట పట్టణంలో ప్రారంభించామని చెప్పారు సందేహాలకు 91006-81183, 78427-39051 కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరని సుజాత కోరారు. ఈ కార్యక్రమంలో మండల వాలంటరీ శిక్షకురాలు అకినపల్లి విజయ, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.