లయన్స్ క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెండ్ షిప్ డే వేడుకలు

IMG 20240804 155124
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రపంచంలో స్నేహానికి మించినది ఏది లేదని రామాయణ, మహాభారత కాలం నుండి నేటికీ మన చిన్ననాటి స్నేహితుల పట్ల మన పాత్ర, ప్రాముఖ్యత పట్ల గల ఆవశ్యకతను ముఖ్య అతిథి లయన్ పిలిగుండ్ల రాములు గౌడ్ వివరించారు. లయన్ క్లబ్ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూ అధ్యక్షతన లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి అదర్శ ఆధ్వర్యంలో ఆదివారం రుద్రారం కిరణ్ గౌడ్ దాతృత్వంతో ఫ్రెండ్ షిప్ డే ను జేఎస్ఆర్ గార్డెన్స్ పోతిరెడ్డిపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో లయన్ సభ్యుల ఇతర ఆత్మీయ మిత్రులతో తీయని పలకరింపులతో ఆనందంతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ చైర్మన్ రాములుగౌడ్, డిస్ట్రిక్ట్ చైర్మన్ శంకరీ విజయేందర్ రెడ్డి, జోన్ చైర్మన్ మంగళపర్తి వెంకటేశంతో పాటు హన్మంథ్ గౌడ్, కార్యదర్శి నాయికోటి రామప్ప, కోశాధికారి శేషాత్వం కృష్ణ, సభ్యులు రజనీ కాంత్, జి.వెంకన్న, సునిల్ కుమార్, లాడే మల్లేశం, మణిక్రావు, బస్వరాజు, శ్రీధర్ రెడ్డి, రాంగోపాల్, భారతయ్య, లక్ష్మారెడ్డి, గురుపాదం, ప్రోగ్రాం చైర్మన్ రుద్రారం కిరణ్ గౌడ్, ముకురాల శ్రీ కాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now