గ‌ద్ద‌ర్ అవార్డుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టేనా..?

గ‌ద్ద‌ర్ అవార్డుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టేనా?

టాలీవుడ్‌కు ఉన్న అసంతృప్తుల్లో అవార్డులు ఒక‌టి. అటు జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అవార్డుల‌కు మొండి చేయి చూపించింది. ఇటు కేసీఆర్ స‌ర్కార్ కూడా చేసిందేం లేదు. నంది అవార్డుల స్థానంలో ‘సింహా పుర‌స్కారాలు’ ఇస్తామ‌ని చెప్ప‌డ‌మే త‌ప్ప‌, ఇచ్చింది లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం పీఠం ఎక్కాక ‘సింహా’ స్థానంలో ‘గ‌ద్ద‌ర్’ అవార్డులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ అందుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ప‌డ‌లేదు.

తాజాగా సీఎంతో చిత్ర‌సీమ ములాఖాత్ అయిన నేప‌థ్యంలో సింహా అవార్డుల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే అవార్డు ప్ర‌క్రియ మొద‌లెడ‌తామ‌ని సీఎం చిత్ర‌సీమ‌కు భ‌రోసా ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మం అంతా ఎఫ్‌డీసీ అనుసంధానంగా జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. ఎఫ్‌డీసీకి ఇప్పుడు దిల్ రాజు ఛైర్మ‌న్‌. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే అవార్డుల కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టే అవ‌కాశం ఉంది. అయితే ఈ అవార్డులు ఎప్ప‌టి నుంచి ఇస్తార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక అవార్డులు లేవు. అప్ప‌టి నుంచి కంటిన్యూ చేస్తారా, లేదంటే ఫ్రెష్షుగా 2024 నుంచే ప్ర‌క‌టిస్తారా? అనేది చూడాలి.

టికెట్ రేట్ల గురించి, బెనిఫిట్ షోల గురించీ ఈ మీటింగ్ లో చ‌ర్చే జ‌ర‌గ‌లేదు. చిత్ర‌సీమ అభివృద్దికి రేవంత్ రెడ్డి కంక‌ణం క‌ట్టుకొన్నార‌ని, టికెట్ రేట్ల‌న్న‌వి చిన్న విష‌య‌మ‌ని, దానికంటే పెద్ద స్థాయిలో ఆలోచిస్తున్నార‌ని దిల్ రాజు చెబుతున్నారు. హాలీవుడ్ కూడా హైద‌రాబాద్ వైపు చూసేలా చ‌ర్య‌లు తీసుకొంటామ‌ని చెప్పారు. మ‌రి ఆ ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్ ఏమిటో? దాని కోసం ప్ర‌భుత్వం, చిత్ర‌సీమ క‌లిసి ఏం చేస్తాయో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment