బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేయించిన గాళ్‌ఫ్రెండ్.. రూ. 2.5 కోట్ల డిమాండ్..!!

బెంగళూరులో షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేయించిన గాళ్‌ఫ్రెండ్.. రూ. 2.5 కోట్ల డిమాండ్

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన

దుబాయ్ నుంచి వచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ను బయటకు వెళ్దామని పిలిపించి కిడ్నాప్

8 రోజులపాటు చిత్రహింసలు

నలుగురు నిందితుల అరెస్ట్..

పరారీలో గాళ్‌ఫ్రెండ్, మరో ముగ్గురు

డబ్బు కోసం గాళ్‌ఫ్రెండే తన బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేయించిన సంచలన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

ఈ డ్రామాలో దుబాయ్‌లో ట్రావెల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేసే లారెన్స్ మెల్విన్ బాధితుడిగా మారాడు. లారెన్స్ మెల్విన్ ఇటీవల తన స్వస్థలమైన బెంగళూరుకు వచ్చాడు. ఈ నెల 16 నుంచి అతను కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతడి తల్లి అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లారెన్స్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు రూ.2.5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది.

పోలీసుల దర్యాప్తులో ఈ కిడ్నాప్ వెనుక లారెన్స్ గాళ్‌ఫ్రెండ్ మహిమా కుట్ర ఉందని తేలింది. ఈ నెల 14న మహిమ “బయటకు వెళ్దాం” అని చెప్పడంతో లారెన్స్ ఆమెతో కలిసి కారు బుక్ చేసుకుని బయలుదేరాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment