గంగవ్వకు గుండెపోటు అవాస్తవం..

గుండెపోటు

గంగవ్వకు గుండెపోటు అవాస్తవం..

 

మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని మై విలేజ్ షో నిర్వాహకులు మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఉన్న గంగవ్వ ఆరోగ్యంపై షో నిర్వాహకులకు కాల్ చేయగా.. అలాంటిదేమీ లేదని వారు చెప్పారన్నారు. గంగవ్వకు గతంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గతంలో అంటే.. బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ పాల్గొన్న విషయం విధితమే.. కేపి

Join WhatsApp

Join Now