గర్గుల్ గ్రామపంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారం

గర్గుల్ గ్రామపంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారం

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 22

కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామ సర్పంచ్ చింతల దివ్య, ఉప సర్పంచ్ గుంటి కాడి ప్రవీణ్, వార్డు సభ్యులు స్వామి, శ్రీనివాస్, రాకేష్ రెడ్డి, ఎల్లవ్వ, అనూష కిషోర్, అనూష నరేష్ రెడ్డి, చింతల రవితేజ గౌడ్, లింబవ్వ, శ్యామ్, రంజిత్ గర్గుల్ గ్రామ జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య నూతన ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గ్రామ సర్పంచ్ చింతల దివ్య రవితేజ గౌడ్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో మమ్ములను సర్పంచిగా ఎన్నుకున్నందుకు గర్గుల్ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. గర్గుల్ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అంతేకాకుండా కామారెడ్డి జిల్లాలోనే గర్గుల్ గ్రామాన్ని నెంబర్ వన్ గ్రామముగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను అన్నారు. గర్గుల్ గ్రామ అభివృద్ధి కోసం ఒక లక్ష్యంతో సమిష్టిగా పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.మా మీద అభిమానంతో యువత పెద్దలు ముందుండి గతంలో కంటే నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటాను అని అన్నారు. అనంతరం గ్రామ పెద్దలు నూతన ప్రజా ప్రతినిధులకు పుష్పగుచ్చాలతో, శాలువలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శోభ, జిపిఓ రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment