గజ్వేల్ లో “కమిషన్” కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు..!!

గజ్వేల్ కాంగ్రెస్ లో ” కమిషన్” రాష్ట్ర నాయకుడు..!!

పైసల్ కొట్టు పని పక్క అంటాడు పైసలు కొట్టాక పత్త ఉండడు..!

బడా నేతలతో పోటోలు మోసపోతున్న బాధితులు..!

మోసపోయిన వాళ్ల లో అధికార పార్టీ నాయకులే అధికం..!

కాంగ్రెస్ నాయకులను ముప్పు తిప్పులు పెడుతున్న వైనం..!

బదిలీలు చేయిస్తా పోస్టింగులు ఇప్పిస్తా అంటూ లక్షలు వసూలు..?

పైసలు ఇవ్వడు పని చేయడు

ఫోను లేపడం మనిషి దొరకడు..!

కక్కలేక! మింగలేక..! ఎవరికీ చెప్పుకోలేక..! ఇబ్బందులు పడుతున్న అధికార పార్టీ నాయకులు..!

ప్రశ్న ఆయుధం ఆగష్టు 12

గజ్వేల్ లో ఓ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుని నిర్వాకం

గజ్వేల్ లో పైసలు కొట్టు పని పక్క అంటూ ఓ రాష్ట్ర కాంగ్రెస్ నేత పలువురి వద్ద లక్షల రూపాయలు తీసుకొని పని చేయకుండా పైసలు ఇవ్వకుండా తిరుగుతున్నాడు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పోస్టింగ్ కు ఇంత రేటు అంటూ తనకు రాష్ట్రంలో మంచి పలుకుబడి ఉందని లక్ష రూపాయల నుండి పది లక్షల వరకు వసూలు చేశారు. అందులో కాంగ్రెస్ నాయకులే అధిక శాతంలో ఉండడం గమనార్హం రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ ఇలా ఏ శాఖ కొత్త అధికారి వచ్చిన తానే చేపించిన అంటూ పై అధికారులతో ఫోన్లు మాట్లాడిపించడం తమకు పనిలో అయితాయని నమ్మకం కుదిరించారు. సీఎం మంత్రులు గాంధీభవన్ వద్ద తనకు మంచి ఫాలోయింగ్ ఉందంటూ ఏ పనైనా ఇట్టే అయిపోతుంది అంటూ బాధితులు దగ్గర నమ్మబలికారు. బడా నేతలతో పోటోలు దిగడం డిల్లీ పెద్దలు సీఎం రేవంత్ మంత్రులు ఇలా పోటోలు దిగడం తో బాధితులు నమ్మి మోసపోతున్నారు. తీరా పని కాకపోవడం అనోట ఈనోటా పాకీ నేను మోసపోయా నువ్వు మోస పోయావా అంటూ మోసపోయిన అధికార పార్టీ నేతలు ఒక చోట కలిసి లబోదిబోమన్నారు. బయటకు చెబితే తమకున్న పరువు పోతుందని కిక్కురు మానకుండా మౌనం వహించడమే వారి వంతైంది.

డబ్బులు ఇచ్చినా నాయకులు బయటకు చెప్పకుండా లోలోపనే కుమిలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ నాయకుడ్నే బదనాము చేయాల్సి వస్తుందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకున్న పలుకుబడితో కానీ పని సైతం చేసేస్తా ముందు డబ్బులు అ నాయకుడు చెప్పడంతో కాంగ్రెస్ నాయకులే కాకుండా రియల్ ఎస్టేట్ ఇతర రంగాల వ్యాపారులు ఆయన ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్న వారు బాగానే మంది ఉంటారంటూ కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మాటలు నమ్మొద్దు అంటూ మరొకరు మోసపోవద్దు అంటూ ఒకచోట వీరందరూ కూర్చుని తమ బాధలు ఒకరికొకరు చెప్పుకోవడం గమనార్హం. అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకుని చేతిలో మోసపోతే ఎవరికి చెప్పు కోవాలో ముర్రు అంటూ లోలోపనే మదన పడుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment