*నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి.హెచ్.ఎం.సి మూసాపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ నాయక్*
– మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి,శుభాకాంక్షలు తెలియజేసిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గ సభ్యులు.
ప్రశ్న ఆయుధం జులై16: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి జి.హెచ్.ఎం.సి మూసాపేట్ 23 సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇస్లావత్ నాయక్ ని వారి కార్యాలయంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి,శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిసి ఇస్లావత్ నాయక్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనతోపాటు,నాణ్యమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని,సజావుగా,పారదర్శకంగా జరిగేలా కృషి చేస్తానని అలాగే శుభాకాంక్షలు చెప్పిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్,జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు,సుజాత,సభ్యులు అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి.హెచ్.ఎం.సి మూసాపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ నాయక్
by Madda Anil
Published On: July 16, 2025 7:33 pm