సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు భక్తుల సర్వ విఘ్నాలను తొలగించి సుఖసంతోషాలు ప్రసాదించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం ఖైరతాబాద్ లోని బడా గణేశుడిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వినాయకుడిగా ప్రసిద్ధి చెంది, భక్తుల కోరికలు తీర్చే గణపతిగా వినాయక నవరాత్రులలో లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణనాథున్ని దర్శించుకుంటారని తెలిపారు. విజ్ఞాధిపతి అయిన ఆ లంబోదరుడి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురా రోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నీలం మధును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్, సభ్యులు వీణ మాధురి, గంగాధర్ యాదవ్,నిశాంత్, మొగల్, సందీప్, రాజు,అజయ్, చిన్న, ఖైరతాబాద్ యూత్ సభ్యులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సర్వ విజ్ఞాలు తీర్చే దేవుడు వినాయకుడు: నీలం మధు ముదిరాజ్
Published On: September 5, 2025 6:47 pm