సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తువులను పంపిణీ చేసినట్లు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ కనబరచాలని, ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగల సామర్థ్యం కలిగి ఉన్నారని, వారికి కావలసిన సదుపాయాలను అందించేందుకు సీజీర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాంబాబు, మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, తుపాకుల రాజు, ఏ.కృష్ణ, గోపాల్, చక్రపాణి, వెంకట్ రెడ్డి, గణేష్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, సత్యనారాయణ, చంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, జయపాల్ రెడ్డి, రాజు, మహేష్, చంద్రశేఖర్, దాసు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
బొంతపల్లి పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణీ: సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి
Published On: September 1, 2025 7:15 pm