బాలికల భవిష్యత్‌ రక్షణలో ప్రభుత్వ చట్టాలు కీలకం: డీడబ్ల్యూఓ లలితాకుమారి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహిళలు, బాలల రక్షణలో ప్రభుత్వ చట్టాలు కీలకమని, బాలికల విద్య, భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.లలితా కుమారి అన్నారు. పది రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం, పాక్సో చట్టం, గృహ హింస చట్టం, పోష్ చట్టం బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.లలితా కుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు, బాలల రక్షణలో ప్రభుత్వ చట్టాలు కీలకమని, బాలికల విద్య, భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పీసీపీఎన్ డీటీ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిషేధమని, దానిని అరికట్టడంలో అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. పాక్సో చట్టం బాలలపై లైంగిక దాడులను అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందని, గృహ హింస చట్టాలు మహిళలకు, బాలికలకు రక్షణ కల్పిస్తున్నాయని, బాల్య వివాహాల నివారణ సమాజం అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. అదే విధంగా, బేటీ బచావో బేటీ పడవో (బీబీబీపీ) కార్యక్రమంలో భాగంగా అందరూ ప్రతిజ్ఞ (ప్లేడ్జి) చేశారు. బాలికల రక్షణ, విద్య, సాధికారతకు కట్టుబడి ఉంటామని అంగీకరించారు. డీడబ్ల్యూఓ గారు చిరకపల్లి–2 ఆంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించి, జరిగిన సెక్టార్ మీటింగ్‌లో ఆంగన్‌వాడీ టీచర్లతో సమావేశమై పౌష్టికాహారం పంపిణీ, గర్భిణీ స్త్రీల, బాలల ఆరోగ్య పరిరక్షణపై సూచనలు అందించారు. అనంతరం చిరాగ్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో అంజమ్మ, మెడికల్ ఆఫీసర్ సోయల్, జిల్లా సమన్వయకర్త పల్లవి, ఆంగన్‌వాడీ టీచర్లు (ఏ డబ్ల్యూ డబ్ల్యూ ఎస్), ఆశలు, (ఏఎన్ఎంఎస్,) సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment