*తారా కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

IMG 20240815 102553
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఎస్.ఎస్. రత్న ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ వలస పాలన నుండి 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రాన్ని పొంది దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమే కాకుండా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు రెండు స్వాతంత్ర పోరాటాలను చేశారని ఒకటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేస్తే, రెండవది నిజాముకు వ్యతిరేకంగా చేశారని, అదేవిధంగా ఆంధ్రుల వలస పాలన నుండి 2014లో విముక్తి పొంది ఈ 10 సంవత్సరాలలో అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందిందని తెలిపారు. భారత దేశం మరియు తెలంగాణ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో ప్రధానమైనదని, యువత ఇదే విధంగా దేశ మరియు రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకుంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి చేయగలుగుతామని, 2047 నాటికి ప్రపంచంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థగా నిలపాల్సిన బాధ్యత మనందరిదని, అమరవీరులు వారి త్యాగాలను స్మరిస్తూ అభివృద్ధిలో మనమందరము ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జగదీశ్వర్, ఎన్ సీసీ అధికారి డాక్టర్ పి. విజయ, ఫిజికల్ డైరెక్టర్ అశ్విని, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందము, ఎన్సిసి క్యాడేట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now