*ఆటో మొబైల్ అండ్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ*
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆటో మొబైల్ అండ్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. గురువారం నాడు నర్సాపూర్ లో శ్రీ బాలాజీ ఆటో మొబైల్ దుకాణం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో మొబైల్ అండ్ మెకానిక్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, అర్జున్, కే.శ్రీనివాస్, హమ్మద్, మహేష్, శేఖర్, సుల్తాన్, భాస్కర్, సర్దార్, ఆశ్రాఫ్, నరేష్, అంజి, సాయి తదితరులు పాల్గొన్నారు.