సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): నూతన లయనిస్టిక్ ఇయర్ 2025-26 దిల్సే శుభారంబ్ మిషన్ 1.5K ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అనేక విషవాయువులతో కలుషితమైతున్న వాతావరణాన్ని మెరుగు పరచడానికి మొక్కలు నాటడమే పరిష్కారమని లయన్స్ క్లబ్ లింగంపల్లి జోన్ చైర్మన్ లయన్ బుల్కపురం కృష్ణాగౌడ్ అన్నారు. మంగళవారం అమీన్ పూర్ పరిధిలోని బృందావన్ టీచర్స్ కాలనీలో వివిధ రకాల మొక్కలు నాటి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ క్లబ్ అధ్యక్షులు లయన్ కూర నాగరాజు, కార్యదర్శి లయన్ కట్లె సిద్ధిరాములు, కోశాధికారి లయన్ తేర్పల్లి కరుణాకర్ రెడ్డి, గ్లోబల్ సర్వీస్ టీం కోఆర్డినేటర్ లయన్ పట్నం సురేందర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లయన్ పురం ఆంజనేయులు, సభ్యులు పేట నాగభూషణం, గోనె లింగం, పద్మ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా క్లబ్ ఆధ్వర్యంలో మునిపల్లి ఉన్నత పాఠశాలలో “మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం నాతోనే ప్రారంభమవుతుంది” అనే అంశం, మరియు మాధారం ఉన్నత పాఠశాలలో “పర్యావరణాన్ని కాపాడుదాం” అనే అంశంతో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు.