గ్రూపు వన్ టూ త్రీ ఫలితాలు నిలిపివేయాలి
– వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షకు వికలాంగుల హక్కుల పోరాట సమితి మద్దతు తెలుపుతుందని జిల్లా అధ్యక్షులు కోల బాలరాజు గూడ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా నుండి ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల నిలిపివేయాలని చేస్తున్న నిరాహార దీక్షకు మేము పూర్తి మద్దతు తెలుపు తున్నామని, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు చేస్తున్న దీక్షకు తాము పూర్తి మద్దతులను కలిపి చేస్తున్నామన్నారు. కామారెడ్డి జిల్లా నాయకులు సుజాత, నైముద్దీన్, జమీలుద్దీన్, రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.