యువత భవిష్యత్ కు మార్గదర్శకంగా గైడెన్స్ సెంటర్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇస్లామిక్ సెంటర్ లో మిల్లీ ఫోరం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గైడెన్స్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించారు. మిల్లీ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్ వహీద్, మహమ్మద్ ముక్తార్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మిల్లీ ఉమూర్ సెక్రటరీ డాక్టర్ ఎస్.కె.ఉస్మాన్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కె.పైసల్ చేతుల మీదగా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.కె. ఉస్మాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు, ఉద్యోగార్థులు, కుటుంబ సంబంధిత కలహాలపై కౌన్సిలింగ్ యువతకు ఉద్యోగ అ అవకాశాలు, విద్యార్థులకు చదువులో మరెన్నో సమస్యలపై సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని, యువత తమ భవిష్యత్ ప్రణాళికలకు మార్గదర్శకంగా ఈ గైడెన్స్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎం.ఏ.కె పైసల్ మాట్లాడుతూ.. మిల్లీ ఫోరం ప్రజల అవసరాల కోసం ఇప్పుడు ముందు వరుసలో ఉంటుందని, పూర్వం ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలపై అవగాహన కల్పించడం, యువతకి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం, వివిధ కోర్సుల వివరాలు అందించడం వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయని అన్నారు. యువతలో ఉన్న అపార నైపుణ్యాన్ని వెలికితీసి, కాలానికి తగినట్టుగా తీర్చిదిద్దితే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సుసాధ్యమవుతుందని అన్నారు. దేశానికి యువతను ఒక వెన్నుముక లాంటి వారిని, జాతికి వారు తరగని ఆస్తి అని అన్నారు. జాతి నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. యువతకు ఇప్పుడు కొనసాగుతున్న షార్ట్ టర్మ్ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్, జాబ్ ఓరియంటెడ్ కోర్సుల గురించి యువతలో అవగాహన కల్పించాలని మిల్లీ ఫోరం సభ్యులనుకు సూచించారు. అభివృద్ధిలో శరవేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఇలాంటి సెంటర్లు ప్రారంభించడం అన్ని రంగాల వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని. ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మిల్లీ ఫోరం వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ ఔర్ ఖారి అబ్దుల్ రజాఖ్ సహాబ్, రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీ సయ్యద్ మునీరుద్దీన్, ఎంఏ హకీమ్, ఉపాధ్యక్షులు సయద్ షానవాజ్, షఫ్యూర్ రహ్మాన్, మహమ్మద్ ఖమర్ అలం, మహమ్మద్ మహమూద్ అలీ, జాయింట్ సెక్రెటరీలు ఎం.ఎ గఫార్, మహమ్మద్ ముజాహిద్ అలీ, ఎంఎ.రషీద్, అడ్వైజర్లు మహమ్మద్ రియాజుద్దీన్, సయ్యద్ కమురుద్దీన్ బుఫారీ, మౌలానా ఇబ్రహీం ఖాన్, మీల్లీ ఫోరం సభ్యులు మత పెద్దలు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment