సంగారెడ్డి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఐసిఐసిఐ ఫృడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ సీనియర్ మేనేజర్ బైసాని కిషోర్ బాబు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుండం మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఐసిఐసిఐ ఫృడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ బైసాని కిషోర్ బాబు, సీనియర్ సేల్స్ మేనేజర్ దువ్వూరి పవన్ రెడ్డి, సేల్స్ మేనేజర్ వసీం అహ్మద్, ఆపరేషన్స్ హెడ్ శివా నాయుడు, సూపర్ డిస్ట్రిబ్యూషన్ లీడర్ సమ్మెట రామమోహన్ రాజు, సిబ్బంది రోహిత్, రాజేశ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.