పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ లకు ఆహ్వానం

IMG 20250816 132403

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మాజీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లను ఆహ్వానించారు. శనివారం హైదరాబాదులో గౌడ సంఘం నాయకులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మాజీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లను కలిసి ఈనెల 18న సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజు గౌడ్, మాజీ జడ్పిటిసి మల్లాగౌడ్, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు కృష్ణగౌడ్, వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment