మధుసూదన్ రెడ్డి వివాహానికి హరీష్ రావు, రఘునందన్ రావుకు ఆహ్వానం

సంగారెడ్డి/పటాన్ చెరు, మే 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీఆర్ఎస్ యువ నాయకుడు పొన్నాల శ్రీనివాస్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి వివాహం జూన్ 5న మెదక్ లో జరగనుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యుడు తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment