కామారెడ్డి, 2026-07-02
రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లిలో అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. సంగీత అనే గర్భవతికి కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా, గుండారం సమీపంలో నొప్పులు ఎక్కువయ్యాయి. EMT రమేష్ నాయక్ సకాలంలో స్పందించి, అంబులెన్స్‌లోనే డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఎల్లారెడ్డిపల్లికి చెందిన సంగీత అనే గర్భవతికి అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. ఆమె భర్త ప్రభాకర్ 108కు కాల్ చేయడంతో, TADWAI అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి నుంచి సంగీతను కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా, గుండారం సమీపంలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్‌ను పక్కకు ఆపి, EMT రమేష్ నాయక్ డెలివరీ చేశారు. సంగీత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ మనీష్ సహకారంతో ఆమెకు చికిత్స అందించి, కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. EMT రమేష్, పైలట్ ఎస్. మహేష్‌లకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.












