ప్రభుత్వ ఆదేశాల మేరకు, కామారెడ్డి పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చడంలో రోటరీ క్లబ్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో రోటరీ క్లబ్ నిరంతరం పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రముఖులు డాక్టర్ రవీందర్ రెడ్డి, ప్రెసిడెంట్ శంకర్, సెక్రటరీ కృష్ణ హరి, ట్రెజరర్ రమణ, రాజనరసింహ రెడ్డి, ధనంజయ్, సంతోష్ మరియు సీనియర్ రోటేరియన్లు పాల్గొన్నారు.
పోలియో నిర్మూలనలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పిల్లల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడింది. నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఆదివారం పోలియో చుక్కలు వేయించలేని తల్లిదండ్రులు, సోమవారం కూడా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించవచ్చని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.









