కామారెడ్డి, 2026-07-01
ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంగీత అనే గర్భిణీకి అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. సంగీత భర్త ప్రభాకర్ 108కు కాల్ చేయడంతో TADWAI అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుండి సంగీతను కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా, గుండారం సమీపంలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి.
ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంగీత అనే గర్భిణీకి అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. సంగీత భర్త ప్రభాకర్ 108కు కాల్ చేయడంతో TADWAI అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుండి సంగీతను కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా, గుండారం సమీపంలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్‌ను పక్కకు ఆపి, ఈఎంటి రమేష్ నాయక్ డెలివరీ చేశారు. సంగీత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ మనీష్ సహాయంతో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం వారిని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో సకాలంలో స్పందించి సాయం చేసిన ఈఎంటి రమేష్, పైలట్ మహేష్‌లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.












