నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ నాగమోహన్ నియమితులయ్యారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల/ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి ప్రొఫెసర్‌గా, విభాగాధిపతిగా పనిచేస్తున్న డా. నాగమోహన్కు ఈ అదనపు బాధ్యతలను అప్పగించారు.
ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న డాక్టర్ పి. శ్రీనివాస్ ఇకపై పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీగా కొనసాగుతారు.
కొత్త ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డా. నాగమోహన్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు డీఎంఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.












