సంగారెడ్డి, జూన్ 30
ప్రభుత్వఆరోగ్యకార్యక్రమాలు,వైద్యసేవలుఅర్హులైనప్రతిఒక్కరికీనూటికినూరుశాతంఅందేలాసమర్థవంతంగాఅమలుచేయాలనిజిల్లాజిల్లా జిల్లా జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్అధికారులనుఆదేశించారు.మంగళవారంవైద్యఆరోగ్యశాఖఅధికారులతోనిర్వహించినఆన్లైన్జూమ్సమావేశంలోఆయనఈసూచనలుచేశారు.
జిల్లాలో ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు, వైద్య సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం అందేలా సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆన్లైన్ జూమ్ సమావేశం నిర్వహించి ఆరోగ్య సేవల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది విధులకు నిర్ణీత సమయానికి తప్పని సరిగా హాజరై ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన వాతావరణం, మరుగుదొడ్ల నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచి రోగులకు అనుకూలమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మరమ్మతులు, ఇతర మౌలిక వసతులను వెంటనే గుర్తించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఆదర్శవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ ఆన్లైన్ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, జిల్లా స్థాయి ప్రోగ్రామ్ ఆఫీసర్లు, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.












