సంగారెడ్డి జిల్లా నూతన వైద్య & ఆరోగ్య శాఖ అధికారిగా (డీఎంహెచ్వో) బాధ్యతలు స్వీకరించిన డా. కె.లలిత దేవిని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. జావీద్ అలీ ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
టీఎన్జీవోస్ యూనియన్ ప్రతినిధులు డా. లలిత దేవికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి వి.రవి, జిల్లా సహాధ్యక్షుడు పి. వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర హెచ్డబ్ల్యూఓ సంఘం అధ్యక్షులు డి.భాస్కర్, సదాశివపేట అధ్యక్షులు నవాజ్ అలీ, జోగిపేట అధ్యక్షుడు నర్సింలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గేష్, కార్యదర్శి షరీఫ్, నాగరాజుతో పాటు పలువురు సంఘ నాయకులు డా. కె.లలిత దేవికి శుభాకాంక్షలు తెలియజేశారు.












