కల్లు డిపోలో భారీగా ఆల్ఫా జోలం పట్టివేత

ఖానాపూర్ శివారులో కల్లు డిపోలో భారీగా ఆల్ఫా జోలం పట్టివేత

నిజామాబాద్ సెప్టెంబర్ 16 (ప్రశ్న ఆయుధం)

నిజామాబాద్ మండలం ఖానాపూర్ శివారులో గల కల్లు డిపోలో భారీగా ఆల్ఫా జోలం పట్టుబడింది. నార్కోటిక్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున జరిపిన దాడిలో దాదాపు మూడు కిలోల అల్ఫాజోలం లభించింది. పక్కా సమాచారం మేరకు నార్కోటిక్ సిఐ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. కల్లు లో కలిపేందుకు ఇతర రాష్ట్రాల నుండి నిజామాబాద్ కు తీసుకొచ్చి క ల్లు డిపోలో నిల్వ ఉంచినట్లు సమాచారం. నిషేధిత మత్తు పదార్థాలను నిల్వ ఉంచిన క ల్లు డిపో యజమాని రమేష్ గౌడ్ ను అరెస్టు చేసి తదుపరి కేసు దార్యాప్తు నిమిత్తం రూరల్ పోలీసులకు అప్పగించారు. నార్కోటిక్ అధికారుల దాడిలో పట్టుబడిన ఆల్ఫాజోలం విలువ దాదాపు మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకు విలువ ఉంటుందని తెలిసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment