ఖర్గే సభకు మేడ్చల్ నుండి భారీగా కాంగ్రెస్ శ్రేణులు

*ఖర్గే సభకు మేడ్చల్ నుండి భారీగా కాంగ్రెస్ శ్రేణులు*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 4

హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో శుక్రవారం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం, గ్రామ, పట్టణ స్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళన భారీ బహిరంగ సభకు మేడ్చల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లాయి.

ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న ఈ సభను విజయవంతం చేయడానికి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గార్ల నాయకత్వంలో పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తు రవి, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అమర్ సింగ్, బోడుప్పల్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శివ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment